Texas: అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మరో తెలుగు విద్యార్థి

by Ramesh Naini |

అమెరికాలో భారతీయ విద్యార్థులు (Indian students) చోరీలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి.

Texas: అమెరికాలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డ మరో తెలుగు విద్యార్థి
X

దిశ, డైనమిక్ బ్యూరో: (America) అమెరికాలో భారతీయ విద్యార్థులు (Indian students) చోరీలకు పాల్పడిన ఘటనలు గతంలో అనేకం వెలుగు చూశాయి. తాజాగా అమెరికాలో దొంగతనం చేస్తూ మరో భారతీయుడు పట్టుబడ్డాడు. ఉన్నత చదువుల కోసం తెలుగు విద్యార్థి కిరణ్ రాపర్తు (26) యూఎస్‌కు వెళ్లాడు. అయితే.. జల్సాలకు అలవాటు పడిన ఆ స్టూడెంట్.. దొంగతనాలు చేయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. 560 డాలర్ల విలువైన సన్‌గ్లాసెస్ దొంగలిస్తూ అతను దొరికిపోయాడని.. పోలీసులు కిరణ్‌కు బేడీలు వేసి స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన (Texas) టెక్సాస్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. (Trump government) ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల వీసాలపై అనేక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇలాంటి చోరీల ఘటనలు తరుచూ రావడంతో విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల ప్రవర్తన గురించి ఆందోళన కలిగిస్తోంది.

Next Story