అమెరికా యూనివర్సిటీలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మృతి

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-18 12:38:16  IST  )

అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది.

అమెరికా యూనివర్సిటీలో మరోసారి కాల్పులు.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. ఫోర్లిడా స్టేట్ యూనివర్సిటీ (Florida state University)లో దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రశాంతంగా ఉన్న క్యాంపస్‌లో ఒక్కసారిగా కాల్పులు శబ్దానికి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడిని ఫోనిక్స్ ఇక్నేర్‌ అనే వ్యక్తిగా గుర్తించారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటన అనంతరం మొత్తం క్యాంపస్‌ను లాక్‌డౌన్ (Lock Down) చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించారు. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 40,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు చేతులు పైకి పైకి ఎత్తుతూ భవనాల నుంచి బయటకి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. ఈ విషయంపై అధ్యక్షుడు ట్రంప్‌ విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని పేర్కొన్నారు.

కాగా, అమెరికాలో కాల్పులు తరచుగా జరుగుతుంటాయి. ఆయుధాలు కలిగి ఉండటం అక్కడ రాజ్యాంగ హక్కు కావడంతో ఆయుధ నియంత్రణ చర్యలు తీసుకోవడం కష్టమవుతోంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రాజకీయ వ్యవస్థ ఇప్పటికీ స్పందించడంలో విఫలమవుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 81 కాల్పుల ఘటనలు అక్కడ చోటుచేసుకున్నాయి.

Click For Tweet Post..

Next Story