ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం.. ఎప్పుడంటే?

by Yella Dhawani Reddy |

ఆకాశంలో మరో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.

ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం.. ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఆకాశంలో మరో అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈనెల 28న సౌరకుటుంబంలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, బుధ గ్రహాలన్నీ ఒకే లైన్‌లో దర్శనమివ్వనున్నాయి. 'ప్లానెట్ పరేడ్'గా పిలిచే ఈ ఖగోళ అద్భుతం దృశ్యాన్ని టెలిస్కోప్ అవసరం లేకుండానే ఈ 7 గ్రహాలను ఒకేసారి చూడొచ్చు. ఇక అమెరికా, మెక్సికో, కెనడా, భారత దేశ ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూడగలరు. తిరిగి ఈ అద్భత దృశ్యం 2040లో కనిపించనుంది.

గత నెలలో కూడా ఈ ప్లానెట్ పరేడ్ ఆకాశంలో కనువిందు చేసింది. వారం రోజుల పాటు ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చాయి. ఇక ఫిబ్రవరి 28న సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఏడు గ్రహాలు.. శని, మెర్క్యురీ, నెప్ట్యూన్, వీనస్, యురేనస్, బృహస్పతి, మార్స్ ఆకాశంలో ఒకే వరుసలోకి వస్తాయి. వాటిలో నాలుగు (బుధుడు, శుక్రుడు, బృహస్పతి ,అంగారకుడు, శని) ఎలాంటి బైనాక్యులర్స్ సాయం లేకుండా కంటితో సులభంగా కనిపిస్తాయి. కానీ, యురేనస్, నెప్ట్యూన్ మాత్రం బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్‌ ద్వారా చూడగలరు.

సౌర వ్యవస్థలో ప్రధానంగా ఎనిమిది గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ వివిధ వేగాలలో తిరుగుతూ ఉంటాయి. బుధ గ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది. కాబట్టి, 88 రోజుల్లో ఇది సూర్యుని చుట్టూ తన కక్ష్యను పూర్తి చేసుకుంటుంది. భూమికి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. దూరంగా ఉన్న నెఫ్ట్యూన్‌కు సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగడానికి 60,190 రోజులు పడుతుంది. అంటే 165 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. ఇలా ఒక్కో గ్రహం వివిధ వేగాలలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుండటం వల్ల, వీటిల్లో పలు గ్రహాలు సూర్యునికి ఒక దిశలో వరుసగా రావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.

Next Story