- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. మరో హిందూ యువకుడి సజీవదహనం
బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడిని అల్లరి మూకలు సజీవదహనం చేసిన భయానక ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో మైనార్టీలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో హిందూ యువకుడిని అల్లరి మూకలు సజీవదహనం చేసిన భయానక ఘటన వెలుగుచూసింది. నార్సింగ్డి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణం.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం (జనవరి 23) రాత్రి అల్లరి మూకలు ఓ షాపుపై దాడి చేశాయి. షట్టర్ మూసి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో.. షాపుల్ నిద్రిస్తున్న చంచల్ చంద్ర భౌమిక్ (23) అనే యువకుడికి మంటలంటుకుని సజీవదహనమయ్యాడు. అతను మరణించాడని నిర్థారించుకున్నాకే అల్లరిమూకలు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భౌమిక్ కు తల్లి, ఇద్దరు సోదరులు ఉండగా.. ఒకరు దివ్యాంగుడు. చాలాకాలం క్రితమే తండ్రి చనిపోవడంతో.. భౌమిక్ కుటుంబాన్ని పోషించేందుకు నార్సింగ్డి ప్రాంతం ఓ గ్యారేజీలో ఆరేళ్లుగా పనిచేస్తూ.. అక్కడే ఉంటున్నాడు. అతని ఆదాయంపైనే కుటుంబం జీవనం సాగిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే భౌమిక్ ను చంపేశారని కుటుంబ సభ్యులు, షాపు యజమాని ఆరోపిస్తున్నారు. గతంలో దీపు చంద్రదాస్, ఖోకొన్ చంద్రదాస్ లను కూడా అల్లరిమూకలు ఇదే తరహాలో హత్య చేశాయి.






