- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అండమాన్ సముద్రంలో మరోసారి భూకంపం
ఇండోనేశియాలోని (Indonasia) బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో (Andaman Sea) మరోసారి భూమి కంపించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇండోనేశియాలోని (Indonasia) బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో (Andaman Sea) మరోసారి భూమి కంపించింది. జులై 4వ తేదీ మధ్యాహ్నం సమయంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.9గా నమోదైంది.
భూకంపం కేంద్రాన్ని పులావు వెహ్ దీవికి సమీపంగా గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనల కేంద్రబిందువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రం సముద్ర మట్టానికి అత్యంత సమీపంగా ఉండటంతో కొన్ని తేలికపాటి ప్రకంపనలను సమీప ప్రాంతాల్లో నివాసితులు అనుభవించినట్లు సమాచారం.
కాగా, గత కొన్ని వారాలుగా అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. గత నెలలో కూడా ఈ సముద్రంలో నాలుగైదు స్వల్ప తీవ్రత కల భూకంపాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జూన్ 30న ఒక్కరోజే 4.6, 4.7, 4.9 తీవ్రత కల భూకంపాలు సంభవించాయి. అయితే తాజా భూకంపానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించినట్లు అధికారులు ప్రకటించలేదు. భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.






