- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మయన్మార్‌లో మరోసారి భూకంపం
మయన్మార్(Myanmar)లో మరోసారి భూకంపం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నిపుణులు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మయన్మార్(Myanmar)లో మరోసారి భూకంపం(Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నిపుణులు చెబుతున్నారు. వరుస భూకంపాల వల్ల ఇప్పటివరకు 1700 మందికిపైగా తీవ్రగాయాల పాలు కాగా, వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియే, సిరియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం మూలంగా దాదాపు 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే అని పేర్కొంటున్నారు.
ఇక మయన్మార్(Myanmar) రాజధాని నేపిడా వద్ద ప్రధాన రహదారులు భూకంపం తీవ్రతకు ధ్వంసం అయ్యాయి. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే ప్రాంతంలో ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ పలు భవనాలు కుప్పకూలిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఒకటని అమెరికా(America) జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది. పైగా ఈసారి పది కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో దాని తీవ్రత అత్యధికంగా కనిపించింది.






