- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ ఇష్యూ.. 5 గంటలు ఆలస్యంగా బయలుదేరిన ఫ్లైట్
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 5 గంటలు ఆలస్యంగా బయలు దేరింది.

దిశ, నేషనల్ బ్యూరో: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం 5 గంటలు ఆలస్యంగా బయలు దేరింది. ఎయిర్‌బస్ A320Neo విమానం (AI 2354) ఉదయం 7:45 కి బయలుదేరాల్సి ఉండగా, రెక్కలో పక్షి గూడు నుంచి వచ్చిన గడ్డి చిక్కుకోవడం వల్ల టెక్నికల్ సమస్య తలెత్తింది. సిబ్బంది విమాన రెక్కల నుంచి గూడును తీసేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చివరికి విమానం 1:00 గంటకు బయలుదేరింది.
సమస్య పరిష్కరించాక విమానానికి క్లియరెన్స్
ఈ ఘటన తర్వాత ప్రయాణికులను తాత్కాలికంగా విమానం నుంచి దింపి, వారికి స్నాక్స్ అందించారు. సమస్య పరిష్కరించాక, విమానానికి క్లియరెన్స్ ఇచ్చారు. సిబ్బందికి ఉన్న విధుల సమయ పరిమితుల కారణంగా వెంటనే విమానం నడపలేకపోయామని, కొత్త సిబ్బంది వచ్చిన తర్వాతే బయలుదేరిందని ఎయిర్ ఇండియా వివరించింది. డీజీసీఏ (DGCA) దేశవ్యాప్తంగా కీలక విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు ప్రారంభించిన కొద్దిసేపటికే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. తనిఖీల్లో పలు భద్రతా లోపాలు వెలుగుచూసిన నేపథ్యంలో (DGCA) అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు ఒక వారంలోపే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.






