- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా ఓ ఫూల్ : డీఎంకే నేత రాజా
డీఎంకే ఎంపీ రాజా అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజా ఓ ‘మూర్ఖుడు‘(fool) అని తమిళనాడులో బీజేపీ గెలుస్తుందని అంటున్నారని విమర్శించారు.

దిశ, నేషనల్ బ్యూరో: డీఎంకే ఎంపీ రాజా అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలతో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారి వేడెక్కాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజా ఓ ‘మూర్ఖుడు‘(fool) అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీ గెలుస్తుందని అంటున్నారని విమర్శించారు. ఇటీవల ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో గెలుపొందిన విధంగానే తమిళనాడులోనూ పాగా వేస్తామని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందన డీఎంకే ఎంపీ రాజా అమిత్ షాను ఫూల్ అనడంతో వివాదంగా మారింది.
అర్వింద్ కేజ్రీవాల్ లాగా స్టాలిన్ ఒంటరి వాడు కాదు
ఓ బహిరంగ సభలో డీఎంకే ఎంపీ రాజా కేంద్ర మంత్రి అమిత్ షాపై కామెంట్స్ చేశారు. అమిత్ షా మధురైకి వచ్చిన సందర్భంలో ‘మేము ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రను చేజిక్కించుకున్నాం. తర్వాత తమిళనాడు అన్నారు.’ అయితే ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ ఒక్కడే కావడంతో ఆయన్ని ఓడించారు. మహారాష్ట్ర, హర్యానాలోనూ మీ ఆటలు సాగాయి. కానీ ఇది తమిళనాడు ఇక్కడ పెరియార్, అన్నాదురై, కరుణానిధితో పాటు ద్రావిడియన్ విశ్వాసాల అండ ఎంకే స్టాలిన్ కు ఉందన్నారు. డీఎంకే ను ఓడించడం అంత సులువు కాదని అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ద్రావిడ భావజాలానికి భయపడుతుందన్నారు. ఎందుకంటే మీరు పై నుంచి ఒక భాష, ఒక దేశం, ఒక మతం అని చెబుతున్నారు. ఇవన్నీ ఒక్కటి ఎలా అవుతాయి అని రాజా అమిత్ షాను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి తీవ్రంగా స్పందించారు. మాజీ కేంద్ర మంత్రి రాజా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ‘మూర్ఖుడు’ అని సంభోదించడం సరికాదన్నారు. కేంద్ర హోంమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు ‘వెదవ’లే అవుతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.






