చంద్రుని మీద కాలు పెట్టబోయే మొదటి మహిళ ఎవరో తెలుసా?

by Dishafeatures2 |
చంద్రుని మీద కాలు పెట్టబోయే మొదటి మహిళ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: చంద్రుని మీద అడుగుపెట్టబోయే మొట్ట మొదటి మహిళగా అమెరికాకు వ్యోమగామి క్రిస్టినా హామ్మొక్ కోచ్ రికార్డు సృష్టించనున్నారు. ఈ మేరకు నాసా ప్రకటించింది. ఆర్టెమిస్ II మూన్ టీమ్ లోని నలుగురు సభ్యుల్లో కోచ్ ఒకరు. ఈ మిషన్ లో జెరెమీ హన్సెన్, విక్టర్ గ్లోవర్ , రెయిడ్ వైజ్ మెన్ తో పాటు కోచ్ కూడా భాగస్వామ్యం కానున్నారు. ఈ వ్యోమగాములు 10 రోజుల పాటు మూన్ మీద పరిశోధనలు చేయనున్నారు.

కాగా క్రిస్టినా కోచ్ 2019లో స్పేస్ స్టేషన్ ను సందర్శించారు. వ్యోమగామి క్రిస్టినా హమాక్ కోచ్ 2013లో నాసాలో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్లైజ్ ఇంజనీర్ గా ఆమె పని చేశారు. ఇక చంద్రుడి మీదకు యాత్ర సందర్భంగా కోచ్ మాట్లాడుతూ.. ఇలాంటి గొప్ప మిషన్ లో పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుడి మీదకు చేరుకుంటామనే ఆలోచన చాలా థ్రిల్లింగ్ గా ఉందని అన్నారు.


Next Story

Most Viewed