- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యపై జాతి వివక్ష కామెంట్స్.. ఘాటుగా స్పందించిన అమెరికా వైస్ ప్రెసిడెంట్
తన భార్య ఉషా వాన్స్ పై చేస్తున్న జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యపై దాడి చేసేది ఎవరైనా తీవ్ర పరినామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు.

దిశ, వెబ్ డెస్క్: తన భార్య ఉషా వాన్స్ పై చేస్తున్న జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యపై దాడి చేసేది ఎవరైనా తీవ్ర పరినామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. నిక్ ఫ్యూయెంటెస్ అనే ఫార్ రైట్ పాడ్ కాస్టర్ గత కొంతకాలంగా ఉషా వాన్స్ ను టార్గెట్ చేస్తూ జాత్యహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఉషా భారతీయ వారసత్వాన్ని కించపరిచేలా జీత్ లాంటి అనుచిత పదాలను ఉపయోగించి, జేడీ వాన్స్ ను జాతి ద్రోహి అంటూ నిక్ ఫ్యూయెంటెస్ విమర్శించాడు.
అతడి తీరుపై నిక్ మండిపడ్డాడు. ఒక విషయం చెబుతున్నా.. నా భార్యపై దాడి చేసేది మాజీ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి అయినా, నిక్ ఫ్యూయెంటెస్ అయినా సరే వాళ్లు నా నుండి గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇది తన అధికారిక విధానం అని స్పష్టం చేశాడు. జాతి విద్వేషం ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించాల్సిందేనని చెప్పాడు. యాంటీ సెమిటిజం లేదా మరే ఇతర జాతి విద్వేశాలకు కన్జర్వేటివ్ ఉద్యమంలో చోటు లేదని స్పష్టం చేశాడు.






