నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆవేదన.. ఒబామాపై అక్కసు

by Naga Rani Yarlagadda |

నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు నోబెల్ శాంతి పురస్కారం -2025 విజేతను ప్రకటించనుంది. యావత్ ప్రపంచమంతా నోబెల్ శాంతి పురస్కారం ఎవరిని వరిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

నోబెల్ శాంతి పురస్కారంపై ట్రంప్ ఆవేదన.. ఒబామాపై అక్కసు
X

దిశ, వెబ్‌డెస్క్: నార్వేజియన్ నోబెల్ కమిటీ నేడు నోబెల్ శాంతి పురస్కారం -2025 విజేతను ప్రకటించనుంది. యావత్ ప్రపంచమంతా నోబెల్ శాంతి పురస్కారం ఎవరిని వరిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పైగా ఈసారి రేసులో డొనాల్డ్ ట్రంప్ పేరు బలంగా వినిపిస్తుండటం కూడా అందరిలోనూ ఉత్కంఠ రేపింది.ఏడు యుద్ధాలని ముగించి, ఒక వివాదంలో మధ్యవర్తిగా నిలిచానని, నోబెల్ శాంతి పురస్కారం తనకే ఇవ్వాలని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ట్రంప్ కు నోబెల్ శాంతి పురస్కారంపై 7 మిలియన్ల డాలర్ల బెట్టింగ్ కూడా కాశారు.

ఈ క్రమంలో ట్రంప్.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పై అక్కసు వెళ్లగక్కారు. ఒబామా ఏమీ చేయకపోయినా నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని వాపోయారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్, కంబోడియా-థాయిలాండ్, కొసావో-సెర్బియా, కాంగో-రువాండా, ఆర్మేనియా- అజర్‌ బైజాన్ మధ్య ఘర్షణలను కూడా తానే పరిష్కరించినట్లు ట్రంప్ చెబుతున్నారు. ఈ వాదనల్లో కొన్నింటికి ప్రత్యర్థి దేశాల నుంచి మద్దతు లభించగా, మరికొన్ని వివాదాస్పదంగా మారాయి. ఉదాహరణకు, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడంలో ట్రంప్ పాత్ర ఉందని పాకిస్థాన్ అంగీకరించగా, భారత్ మాత్రం దీనిని ధృవీకరించలేదు. నోబెల్ శాంతి బహుమతిపై తాను గంపెడాశలు పెట్టుకున్నానని, ఇప్పుడు చూస్తే ప్రైజ్ వచ్చేలా కనిపించడం లేదని ట్రంప్ ఆవేదన చెందుతున్నారు. ఈ రేసులో సూడాన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ముందుండటం విశేషం.

Next Story