- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై "ఆపరేషన్ మిడ్ నైట్".. అమెరికా రక్షణ మంత్రి కీలక ప్రకటన
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ లోని రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పారు. ఆపరేషన్ మిడ్ నైట్ మాయర్ పేరుతో ఇరాన్ పై ఎటాక్ చేసినట్టు తెలిపారు. ఇరాన్ పై ఆపరేషన్ సూపర సక్సెస్ అని, ఇరాన్ ప్రతిదాడులకు దిగితే గట్టిగా జవాబు ఇస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా టెహ్రాన్ ప్రజలను గానీ సైనికులను గానీ టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. కేవలం అణు స్థావరాలపైనే దాడులు చేశామని స్పష్టం చేశారు. మిసౌరీ నుండి బీ 2 బాంబర్లు బయల్దేరి ఇరాన్ అణుస్థావరాలపై 14 బంకర్ బస్టర్లను ప్రయోగించినట్టు చెప్పారు. ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చడం తమ ఉద్దేశం కాదని, 10 ఏళ్లుగా అణుప్రయోగాలు వద్దని హెచ్చరిస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు.






