- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > Qatar Airways: ఆకాశంలో కుదపునకు గురైన మరో విమానం.. 12 మంది ప్రయాణికులకు గాయాలు
Qatar Airways: ఆకాశంలో కుదపునకు గురైన మరో విమానం.. 12 మంది ప్రయాణికులకు గాయాలు
by Kema Shiva Kumar |
ఇటీవలే లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఆకాశంలో కుదుపునకు గురైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఆకాశంలో కుదుపునకు గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఆ ఘటనను మరువకు ముందే మరో విమానం గగనతలంలో తీవ్ర కుదుపునకు గురైంది. దోహా నుంచి ఐర్లాండ్‌లోని డబ్లిన్‌కు వెళ్తున్న ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం మార్గమధ్యలో టర్కీ దేశ గగనతలంలో తీవ్ర కుదుపులకు గురైంది. ఈ ప్రమాదంలో విమానంలోని 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో ఆరుగురు ఫ్లైట్ క్రూ కూడా ఉన్నారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో ప్రయాణం సాఫీగా సాగి డబ్లిన్‌లో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది.
Next Story






