- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: 70 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఇతర సిబ్బందితో న్యూయార్క్ లో ల్యాండ్ అవుతున్న విమానం.. ఫైర్ ట్రక్కును ఢీ కొట్టింది. లాగార్డియా విమానాశ్రయంలో జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి ఈ పెనుప్రమాదం సంభవించింది. ఎయిర్ కెనడాకు చెందిన జాజ్ ఏవియేషన్ విమానం రన్‌వేపై ఉన్న ఫైర్ ఫైటింగ్ వాహనాన్ని (Fire Truck) బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే?
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:40 గంటల సమయంలో కెనడాలోని మాంట్రియల్ నుండి వచ్చిన ఫ్లైట్ 8646 (CRJ-900 విమానం) లాగార్డియా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. అదే సమయంలో రన్‌వే-4పై మరో విమానంలో పొగలు వస్తున్నాయన్న సమాచారంతో సహాయక చర్యల కోసం పోర్ట్ అథారిటీకి చెందిన ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకుంది. సుమారు 24 మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న ఎయిర్ కెనడా విమానం అకస్మాత్తుగా ఈ ఫైర్ ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 72 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో విమాన పైలట్, కో-పైలట్ మరణించినట్లు పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ గార్సియా ధృవీకరించారు. విమానంలోని 39 మంది ప్రయాణికులతో పాటు ఫైర్ ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు అధికారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న 41 మందిలో 32 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
నిలిచిపోయిన విమాన సర్వీసులు
ప్రమాదం జరిగిన వెంటనే లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు విమాన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనివల్ల సుమారు 18 విమానాలను జెఎఫ్‌కే (JFK), నెవార్క్ విమానాశ్రయాలకు మళ్లించారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB), ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వైఫల్యం ఉందా? లేదా ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.






