- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌తో సంబంధాలపై ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
భారత్ వల్లే పాకిస్థాన్‌తో వైరం ఏర్పడిందా..అనే ప్రశ్నకు ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రి మౌలవీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ ఆరోపణలు నిరాధారామైనవి, ఆమోదయోగ్యమైనవి కావు అని స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత్ వల్లే పాకిస్థాన్‌తో వైరం ఏర్పడిందా..అనే ప్రశ్నకు ఆఫ్గనిస్థాన్ రక్షణ మంత్రి మౌలవీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ ఆరోపణలు నిరాధారామైనవి, ఆమోదయోగ్యమైనవి కావు అని స్పష్టం చేశారు. కాబూల్ తన విదేశీ సంబంధాలను స్వతంత్య్రంగా కొనసాగిస్తుందని చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా భారత దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా భారత్ తో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని చెప్పారు. తమ విధానంలో ఆఫ్గనిస్థాన్ భూభాగం ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయదని చెప్పారు. తమ పొరుగుదేశం పాకిస్థాన్ తో మంచి సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పాకిస్థాన్ ఆఫ్గనిస్థాన్ రెండు పొరుగు దేశాలని ఇరు దైశాల మధ్య వైరం వల్ల ఎవరికీ లాభం ఉండదని చెప్పారు. రెండు దేశాల మధ్య పరస్పర ఒప్పందాలు ఉండాలని అన్నారు.






