- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భగ్గుమన్న ఆప్ఘన్ - పాక్ సరిహద్దు.. డ్రోన్ దాడుల్లో 10 మంది మృతి
ఆప్ఘనిస్థాన్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్ వాణిజ్యమంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజజ్ ప్రస్తుతం భారత పర్యటనలో..

దిశ, వెబ్‌డెస్క్: ఆప్ఘనిస్థాన్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆప్ఘన్ వాణిజ్యమంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజజ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా.. ఆప్ఘన్ పై పాకిస్థాన్ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. గత అర్థరాత్రి ఆప్ఘన్ లోని ఖోస్ట్ ప్రావిన్స్ పై పాక్ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో సరిహద్దుల్లో ఉన్న ఇళ్లు ధ్వంసమవ్వగా 9 మంది చిన్నారులు సహా 10 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. తమ దేశంలోని ఇతర ప్రావిన్సులపై కూడా ఈ దాడుల ప్రభావం ఉందని తెలిపింది. పాకిస్థాన్ లోని పెషావర్ లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆప్ఘనిస్థాన్ .. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పిస్తోందని పాక్ సర్కార్ ఆరోపిస్తోంది.
కాగా.. గతంలో కూడా ఆప్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనే పాకిస్థాన్ ఈ దాడులకు పాల్పడింది. టీటీపీ చీఫ్ స్థావరమే లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలిపింది. కానీ.. ఆప్ఘన్ మంత్రులు భారత్ పర్యటనలో ఉన్న సమయంలో దాడులు జరుగుతుండటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.






