- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాదీ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. హంతకుడి సెల్ఫీ వీడియో
బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న ఫైసల్ కరీం మసూద్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని హాదీ హత్యతో తనకు ఎలాంటతి సంబంధం లేదని వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న ఫైసల్ కరీం మసూద్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. తాను ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నానని హాదీ హత్యతో తనకు ఎలాంటతి సంబంధం లేదని వెల్లడించాడు. అంతే కాకుండా మాజాత్ షిబర్ ఈ హత్య చేశాడని ఆరోపించాడు. హాదీతో తన సంబంధాలు కేవలం వ్యాపార సంబంధమైనవి అని చెప్పాడు. హాదీ జమాత్ కు చెందినవాడని జమాతీలే ఈ హత్య వెనుక ఉండవచ్చని ఆరోపించాడు. తాను ఓ ఐటీ కంపెనీ అధినేత వద్ద పనిచేస్తున్నానని ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పొలిటికల్ డొనేషన్స్ కోసమే హాదీని కలిసినట్టు చెప్పాడు.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ పోలీసులు మసూద్ మరియు అలాంగిర్ షెయిక్ హాదీ హత్య తరవాత బంగ్లాదేశ్ పారిపోయారని చెప్పారు. వాళ్లు హలాగట్ బార్డర్ ద్వారా ఇండియాకు పారిపోయారని అన్నారు. భారత అధికారులు బంగ్లాదేశ్ పోలీసులు చేసిన ౠరోపణలను ఖండించారు. ఇక హాదీని డిసెంబర్ 12న డాకాలోని పల్టాన్ ప్రాంతంలో దుండగులు కాల్చి చంపారు. పొలిటికల్ ప్రచార సభలో ఉన్న అతడిపై కాల్పులు జరపగా తీవ్రంగా గాయపడి సింగపూర్ ఆస్పత్రిలో మరణించాడు. దీంతో బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగాయి. ఇప్పటికీ ప్రజల ఆగ్రహ జ్వాలలు ఆరడంలేదు.






