భయంకరమైన పీడకలగా విమాన ప్రయాణం.. టాయిలెట్స్ పనిచేయక.. బాటిళ్లలో.. నిల్చున్న చోటనే..

by Sujitha Rachapalli |

ఆగస్టు 28, 2025.. విమాన ప్రయాణం.. వర్జిన్ ఆస్ట్రేలియా ఫ్లైట్ VA50.. బాలి (డెన్‌పసార్) నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే బోయింగ్ 737 MAX 8 విమానం.. ప్రయాణికులకు జీవితంలో మరిచిపోలేని దుర్భరమైన అనుభవాన్ని అందించింది. టాయిలెట్లు పనిచేయకపోవడంతో

భయంకరమైన పీడకలగా విమాన ప్రయాణం.. టాయిలెట్స్ పనిచేయక.. బాటిళ్లలో.. నిల్చున్న చోటనే..
X

దిశ, వెబ్ డెస్క్ : ఆగస్టు 28, 2025.. విమాన ప్రయాణం.. వర్జిన్ ఆస్ట్రేలియా ఫ్లైట్ VA50.. బాలి (డెన్‌పసార్) నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే బోయింగ్ 737 MAX 8 విమానం.. ప్రయాణికులకు జీవితంలో మరిచిపోలేని దుర్భరమైన అనుభవాన్ని అందించింది. టాయిలెట్లు పనిచేయకపోవడంతో ఆరు గంటల ప్రయాణం ప్రయాణీకులకు ఒక భయంకరమైన, అవమానకరమైన అనుభవంగా మారింది. ఈ ఘటన ఎయిర్‌లైన్ నిర్వహణ, ప్రయాణికుల సంక్షేమం, విమానంలో పరిశుభ్రతపై ఆందోళనలను లేవనెత్తింది.

ప్రయాణ వివరాలు

* నిజానికి ఫ్లైట్ డెన్‌పసార్ బయలుదేరే ముందే ఒక టాయిలెట్ పనిచేయడం లేదని తెలిసింది. కానీ టెక్నికల్ సపోర్ట్ ఎక్కువగా లేదని.. మిగిలిన రెండు టాయిలెట్లతో ప్రయాణికులు సర్దుకుంటారనే ఉద్దేశంతో.. ఫ్లైట్ ఆలస్యం చేయకుండా, రద్దు చేయకుండా నడిపించింది వర్జిన్ ఆస్ట్రేలియా. కానీ పూర్తిగా నిండిన ప్రయాణికులతో ఉన్న ఫ్లైట్‌లో రెండు టాయిలెట్స్ సరిపోవని కూడా తెలుసు.

* ఇదిలా ఉంటే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రెండో టాయిలెట్ కూడా పనిచేయకుండా పోయింది. దీంతో ప్రయాణికులకు ఒక్కటి మాత్రమే ఆప్షన్. అది కూడా ఒక్కరు యూజ్ చేశాక మరొకరు వినియోగించేందుకు దాదాపు 40 నిమిషాల సమయం పడుతుంది. కానీ సుమారు మూడు గంటల తర్వాత చివరి టాయిలెట్ కూడా పనిచేయకపోవడంతో అటెండెంట్స్ పరిస్థితి దారుణంగా మారింది. దీంతో బాటిల్స్‌లో యూరిన్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కానీ ఓ వృద్ధురాలు భరించలేక బట్టల్లోనే టాయిలెట్ చేయడం.. మరొకరు చేతులు కడుక్కునే వాష్ బేసిన్ యూజ్ చేయడం.. జరిగిందని తెలుస్తోంది.

* ఈ సమస్యకు కారణం నీటి సరఫరా లేకపోవడమే. టాయిలెట్ యూజ్ చేశాక ఫ్లష్ ప్రెస్ చేస్తే వాటర్ రాకపోవడంతో వ్యర్థాలు అలాగే ఉండిపోయాయని.. ఫ్లైట్ మొత్తం దుర్వాసన వెదజల్లిందని.. పిల్లలు, వృద్ధులు, మహిళలు దారుణంగా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు ప్రయాణికులు.

* అయితే ఈ టైమ్‌లో క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తాము చేయాల్సిన ప్రయత్నం చేశారు. వ్యర్థాలను మాన్యువల్‌గా తొలగించే ప్రయత్నం చేసి ప్రశంసలు అందుకున్నారు.

ఎయిర్‌లైన్ రియాక్షన్

వర్జిన్ ఆస్ట్రేలియా చేసిన తప్పును అంగీకరించింది. ప్రయాణికులకు బహిరంగ క్షమాపణ చెప్పింది. కష్టమైన పరిస్థితుల్లోనూ చక్కగా విధులు నిర్వహించిన క్యాబిన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు ప్రయాణికులకు ఫ్లైట్‌ ఖర్చులు పూర్తిగా రిటర్న్ చేస్తామని.. పర్సనల్‌గా కాంటాక్ట్ చేస్తామని చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.

Next Story