జపాన్ సునామీ గోడ.. ప్రపంచంలోనే తొలి ప్రకృతి ఆధారిత తీరప్రాంత రక్షణ వ్యవస్థ

by Sujitha Rachapalli |

జపాన్ 2011లో భారీ విపత్తును ఎదుర్కొంది. భూకంపం, సునామీ కారణంగా 18వేల మంది మరణించారు. లక్షలాది భవనాలు కూలిపోయాయి. ఫుకుషిమా అణు విస్ఫోటనం జరిగింది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. తీరప్రాంత ప్రజలను రక్షించేందుకు మల్టిపుల్ లైన్స్

జపాన్ సునామీ గోడ.. ప్రపంచంలోనే తొలి ప్రకృతి ఆధారిత తీరప్రాంత రక్షణ వ్యవస్థ
X

దిశ, వెబ్ డెస్క్ : జపాన్ 2011లో భారీ విపత్తును ఎదుర్కొంది. భూకంపం, సునామీ కారణంగా 18వేల మంది మరణించారు. లక్షలాది భవనాలు కూలిపోయాయి. ఫుకుషిమా అణు విస్ఫోటనం జరిగింది. దీంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. తీరప్రాంత ప్రజలను రక్షించేందుకు మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డిఫెన్స్ వ్యూహంతో ముందుకొచ్చింది. 395 కిలోమీటర్ల సునామీ వాల్‌ను నిర్మిస్తూనే దాని వెంట 90లక్షల చెట్లను నాటేందుకు సంకల్పించింది. ఇంజనీరింగ్, నేచర్ సమ్మేళనంతో గ్రేట్ అవుట్‌పుట్‌ను తీసుకొచ్చి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది.

2011 సునామీ తరంగాలు 15 మీటర్ల ఎత్తుకు చేరాయి. అప్పటి సీవాల్స్ ఎనిమిది మీటర్ల వరకు ఉండగా వాటిని అధిగమించాయి. దీంతో ఫుకుషిమా, ఇవాటె, మియాగి ఫ్రావిన్స్‌లో భారీ నష్టం వాటిల్లింది. 17వ శతాబ్దంలో 70వేల చెట్లు నాటిన తకామత్సుబారా ఫారెస్ట్ కూడా పూర్తిగా నాశనమైంది. ఈ విపత్తు నుంచి పాఠం నేర్చుకున్న జపాన్.. అయోమోరి నుంచి ఫుకుషిమా వరకు 395 కిలో మీటర్ల పొడవున్న సీవాల్‌ను 15 కిలోమీటర్ల ఎత్తుతో నిర్మించింది. గ్రేట్ ఫారెస్ట్ వాల్ ప్రాజెక్ట్‌లోనే తొమ్మిది మిలియన్ల చెట్లను నాటింది. కాంక్రీట్, వేవ్ డిసిపేటింగ్ బ్లాకులతో.. భూకంపాలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది.

ఇక తొమ్మిది మిలియన్ చెట్లలో బ్లాక్ పైన్స్, ఓక్స్, లారెల్స్ వంటివి ఉన్నాయి. డెబ్రీస్‌తో మట్టిని మిశ్రమంగా చేసి మౌండ్స్ తయారు చేసి.. తరంగాలను తట్టుకునేలా మూడు మీటర్ల లోతులో వీటిని నాటారు. చెట్లు నీటి వేగాన్ని 50శాతం వరకు తగ్గించి.. మట్టి ఎరోషన్‌ను ఆపగలవు. తరంగాల శక్తిని తగ్గించగలవు. పక్షులు, జంతువులకు ఈ ఫారెస్ట్ ఆవాసంగా మారుతుండటంతో బయోడైవర్సిటీకి దోహదం చేస్తుంది. వాతావరణాన్ని రక్షిస్తుంది.

Next Story