ఎక్కువగా అరుస్తుందని వదిలేసారు.. ప్రాణాలను పణ్ణంగా పెట్టి యజమానిని కాపాడి చూపించిన కుక్క!

by Yella Dhawani Reddy |

కుక్కలు విశ్వాసానికి మారు పేరు అన్న మాట మరోసారి ఋజువైంది. తాము ప్రేమించిన యజమానిని కాపాడటానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసిస్తాయి.

ఎక్కువగా అరుస్తుందని వదిలేసారు.. ప్రాణాలను పణ్ణంగా పెట్టి యజమానిని కాపాడి చూపించిన కుక్క!
X

దిశ, వెబ్ డెస్క్: కుక్కలు (Dogs) విశ్వాసానికి మారు పేరు అన్న మాట మరోసారి ఋజువైంది. తాము ప్రేమించిన యజమానిని కాపాడటానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసిస్తాయి. ఇలాంటి ఓ ఉదంతం ఇటీవల జపాన్‌లో (Japan) వెలుగుచూసింది. ఏడాది వయసున్న చిన్నపాటి బీగిల్ కుక్క తన యజమాని జీవితాన్ని కాపాడింది. వివరాల్లోకి వెళ్లితే..

నిగాటా నగరంలో ఉన్న చరిత్రాత్మకమైన యోకోకు ఆలయంలో45 ఏళ్ల తౌగెన్ యోషిహారా అబ్బట్‌గా (ముఖ్య సన్యాసిగా) పని చేస్తున్నారు. గట్టి గట్టిగా అరుస్తుందని కొన్ని రోజుల క్రితం ఈ ఆలయంలో సమీపంలో కొందరు సంవత్సరం వయసున్న ఓ కుక్కను వదిలేసి వెళ్లారు. దానిని యోషిహారా దత్తాత తీసుకుని చికో అని పేరు పెట్టి ప్రేమ చూసుకోవటం ప్రారంభించాడు. ఓ రోజు యోషిహారా కుక్కను తీసుకుని సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో వారికి అనుకోని సంఘటన ఎదురైంది. అనూహ్యంగా అక్కడ ఓ 1.6 మీటర్ల పొడవు ఉన్న ఎలుగుబంటి ఎదురుగా వచ్చింది. దాని రూపం భయంకరంగా ఉండటంతో, యోషిహారా తప్పించుకోవాలని ప్రయత్నించారు.

అయితే, పరిగెత్తే క్రమంలో యోషిహారా తూలి కిందపడిపోయాడు. ఈ క్రమంలో ఆయన కుడి భుజం విరిగింది. ఈ పరిస్థితిని గమనించిన చికో చిన్నదైన శరీరం, వయసుతో సంబంధం లేకుండా.. ఎలుగుబంటి మీద గట్టిగా మొరుగుతూ దానిని వెనక్కి తోసింది. దీంతో ఎలుగుబంటి భయపడి పరుగులు పెట్టింది. చికో కూడా కొంత దూరం దాని వెంట వెళ్లింది. అయితే చికో చాలాసేపటి వరకు వెనక్కి తిరిగిరాకపోవటంతో యోషిహారా తీవ్రవేదనతో, విరిగిన భుజంతోనే అటవీ లోపల చికో కోసం వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో అతని భార్య నుంచి కాల్ వచ్చింది. చికో ఇంటికే తిరిగొచ్చిందని చెప్పటంతో ఆనందభాష్పాలతో యోషిహారా ఇంటికి చేరి తనను రక్షించిన కుక్కను ప్రేమగా కౌగిలించుకున్నాడు. కాగా, ప్రస్తుతం నిగాటా ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇప్పటివరకు ఈ సంవత్సరంలో 160 పైగా ఎలుగుబంటి కనిపించినట్లు తెలిపింద.

Next Story