- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ ప్రిన్సిపాల్ అరాచకం.. పడుకోని మసాజ్ చేయించుకుంటూ!
చిన్న పిల్లలతో ఓ లేడీ ప్రిన్సిపాల్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. క్లాస్ రూమ్ లోనే కింద పడుకొని సేద తీరింది.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కామెడీ, భయానక, వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలైతే కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ లేడీ ప్రిన్సిపాల్, వాళ్లతో చాకిరి చేయించుకుంది. క్లాస్ రూమ్ లోనే పడుకొని మరీ, కాళ్లకు మసాజ్ చేయించుకుంది. ఈ తరుణంలోనే చిన్న పిల్లలతో సదరు లేడీ ప్రిన్సిపాల్ మసాజ్ చేయించుకుంటున్న వీడియో వైరల్ గా మారింది.
స్కూల్ టీచర్ అరాచకం
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చిత్రకూట్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ లేడీ ప్రిన్సిపాల్ మధు రాయ్, చిన్నపిల్లలతో మసాజ్ చేయించుకుంది. క్లాస్ రూమ్ లోనే హాయిగా పడుకొని, మసాజ్ చేయించుకుంటూ, సేద తీరింది. పడుకొని మొబైల్ ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ, ఆ పిల్లలకు నరకం చూపించింది మధు రాయ్. దీంతో పిల్లలకు చదువు చెప్పకుండా, మసాజ్ చేయించుకున్న సదరు లేడి టీచర్ మధు రాయ్ వీడియో వైరల్ అయింది. ఇక ఈ సంఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో సదరు లేడీ ప్రిన్సిపల్ మధు రాయ్ ని జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ సంఘటనపై నెటిజెన్స్, సామాజిక వేత్తలు సీరియస్ అవుతున్నారు. ఆ లేడీ ప్రిన్సిపాల్ కు అసలు బుద్ది ఉందా ? అంటూ మండిపడుతున్నారు.






