Pakistan Bomb Blast : మసీదులో ఆత్మాహుతి దాడి.. 70 మంది వరకు..

by Malleboina Mahesh |   (  Updated:2023-01-30 09:17:05  IST  )

పాకిస్తాన్ లో పెషావర్ లోని ఓ మసిదులో ఆత్మాహుతి దాడి జరిగింది.

Pakistan Bomb Blast : మసీదులో ఆత్మాహుతి దాడి.. 70 మంది వరకు..
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ లో పెషావర్ లోని ఓ మసిదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో నమాజ్ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అంతా ఒక్కసారి ఉలిక్కిపడి నట్లు తెలిపారు. కాగా ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు స్పష్టం చేశారు. ఈ పేలుడు కారణంగా మసీదులో ఉన్న 70 మంది వరకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. అలాగే గాయపడ్డ వారిలో 25 మంది పోలీసులు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటి వరకు ఎవరు చనిపోలేదు.

Next Story