- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరుదైన విషయం.. ఆరు నెలలకోసారి దేశం మారే దీవి.. ఎక్కడుందంటే?
తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు లేదా ఇద్దరు కూతుళ్లు ఉంటే..

దిశ, వెబ్ డెస్క్: తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు లేదా ఇద్దరు కూతుళ్లు ఉంటే.. వృద్ధాప్యంలో వారిని పోషించే బాధ్యతను చెరో ఆరు నెలలు వంతులు వేసుకోవటం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఓ ఐలాండ్‌ను కూడా రెండు దేశాలు చెరో ఆరె నెలలు పాలించే అరుదైన విషయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యకరంగా ఉంది కదా.. నిజంగా ప్రతి ఆరు నెలలకు జాతీయత మారే వింతైన దీవి ప్రపంచంలో ఉంది. అంతేకాదు, ఆ దీవిపై పెత్తనం కోసం ఆ రెండు దేశాలు దాదాపు మూడు దశాబ్ధాల పాటు యుద్ధం కూడా చేశాయి. ఇంతకీ ఆ దీవి పేరేంటి? ఎక్కడుంది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫీజంట్ దీవి (Pheasant Island).. ఫ్రాన్స్ (France), స్పెయిన్ (Spain) దేశాల మధ్య సరిహద్దుగా ఉండే బిడాసో నదిలో ఉంది. కేవలం 2.17 ఎకరాలు మాత్రమే విస్తీర్ణం ఉండే ఈ దీవి.. ఏడాదిలో ఆరు నెలలు స్పెయిన్ ఆధీనంలో, మరో ఆరు నెలలు ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుంది. ఇందుకోసం ఇరు దేశాలు 17వ శతాబ్ధంలో 30 ఏళ్ల పాటు యుద్ధం చేశాయి. ఆ తర్వాత రెండు దేశాలకు చెందిన ప్రతినిధులు 11 ఏళ్లలో 24 సార్లు సమావేశమై చర్చోపచర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.
చివరగా.. 1659లో ఇరు దేశాల ఈ దీవి ఆధిపత్యాన్ని చెరో ఆరునెలలూ పంచుకునేలా ఒప్పందానికి వచ్చాయి. దీనిని పైరినీస్ ఒప్పందం అని పిలుస్తారు. అప్పటి నుంచి ఇది ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య శాంతికి ప్రతీకగా నిలుస్తోంది. ఒప్పందానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శిలాశాసనం ఇప్పటికీ అక్కడ చూడొచ్చు. 1660లో స్పెయిన్ చక్రవర్తి ఫిలిమ్ IV కుమార్తె మరియా థెరిసాను ఫ్రాన్స్ చక్రవర్తి లూయిస్ XIV ఈ దీవిలోనే వివాహం చేసుకున్నాడు. ఇక ప్రతి ఏటా ఈ దీవి ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు స్పెయిన్ ఆధీనంలో, ఆగస్టు 1 నుంచి జనవరి 31 వరకు ఫ్రాన్స్ ఆధీనంలో ఉంటుంది.
ఇంతటి చరిత్ర ఉన్న ఈ దీవి అలాగని పర్యాటక ప్రాంతం కూడా కాదు. పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, ఏటా దీవిని అప్పగించే కార్యక్రమాలు చూడటానికి, చారిత్రక టూర్స్‌లో భాగంగా వెళ్తే మాత్రం పర్యాటకులకు అనుమతిస్తారు. స్పెయిన్ అధీనంలో ఉన్నప్పుడు ఇరున్ మున్సిపాలిటీ, ఫ్రాన్స్ అధీనంలో ఉన్నప్పుడు హెండయె మున్సిపాలిటీ ఈ దీవిని శుభ్రపరిచి.. గార్డెనింగ్ పనులు చేస్తాయి. నావిక దళం పర్యవేక్షిస్తుంటుంది. ప్రతి ఐదు రోజులకోసారి నేవీ అధికారులు దీవిలోకి వచ్చి పరిశీలించి వెళ్తారు.






