Breaking News : అమెరికాలో సంచలనం.. సజీవంగా 300 ఏళ్లు దాటిన వ్యక్తి!

by Muthe.Rajitha |

అగ్రరాజ్యం అమెరికా(USA)లో 300 ఏళ్లు దాటిన వ్యక్తులు సజీవంగా ఉండటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది.

Breaking News : అమెరికాలో సంచలనం.. సజీవంగా 300 ఏళ్లు దాటిన వ్యక్తి!
X

దిశ, వెబ్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికా(USA)లో 300 ఏళ్లు దాటిన వ్యక్తులు సజీవంగా ఉండటం ప్రస్తుతం సంచలనం రేపుతోంది. అమెరికా సోషల్ సెక్యూరిటీ డాటా(Social Security Database) ప్రకారం.. ఆ దేశంలో ఇప్పటికీ 200 ఏళ్లు దాటిన వ్యక్తులు సజీవంగా ఉన్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఒకరి ఇద్దరో కాదు అలాంటి వాళ్ళు ఏకంగా 2 వేల మంది ఉన్నట్టు సెక్యూరిటీ డాటాలో లెక్కలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE) బృందం అధికారికంగా ధృవీకరించడం ప్రధాన వార్తల్లో నిలిచింది. అయితే నిజానికి సోషల్ సెక్యూరిటీ డాటాలో ఆడిట్స్ నిర్వహించకపోవడం వలన తలెత్తిన సమస్యగా అధికారులు చెబుతున్నారు.

ప్రతి ఏడాది అమెరికాలో పౌరుల సంఖ్యను సవరించడం లేదని, ప్రస్తుతం అమెరికాలో ఉన్న జనాభాఆ కంటే సోషల్ సెక్యూరిటీ డాటాలో ఎక్కువ మంది ఉన్నారని, ఇది ఆ దేశ చరిత్రలో పెద్ద మోసంగా అభివర్ణిస్తున్నారు. కాగా ప్రస్తుతం చూపిస్తున్న లెక్కల ప్రకారం.. 100 ఏళ్లు దాటిన వారు అమెరికాలో 18 మిలియన్ల మంది ఉన్నారు. 112 ఏళ్లు దాటిన వారు 65 లక్షల మంది ఆ దేశంలో నివసిస్తున్నట్టు చూపిస్తుంది. వాస్తవానికి 112 ఏళ్లు దాటిన వారు ప్రపంచం మొత్తం మీద కేవలం 35 మంది మాత్రమే ఉన్నారు. సోషల్ సెక్యూరిటీ డాటా అనేది అమెరికాలో నివసిస్తున్న పౌరులకు చెందిన రిటైర్మెంట్, వృద్ధాప్యంలో ఉన్నవారి వివరాలను సేకరిస్తూ.. అప్డేట్ చేస్తూ ఉంటుంది.

Next Story