ఖతర్‌లో భయం, భ‌యం.. ఇళ్ల మధ్యలో మిస్సైల్ విధ్వంసం

by velandi.Saikiran |   (  Updated:2026-02-28 22:21:45  IST  )

ఖతర్ లో నివాస సముదాయాలు ఉన్న ఓ చోట భారీ మిస్సైల్ పడింది. దీంతో జనాలు రోడ్డుపైన పరిగెడుతూ కనిపించారు

ఖతర్‌లో భయం, భ‌యం.. ఇళ్ల మధ్యలో మిస్సైల్ విధ్వంసం
X

దిశ‌, వెబ్ న్యూస్‌: ఇరాన్ రివర్స్ ఎటాక్ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు గజగజ వణికి పోతున్నాయి. ఇందులో భాగంగానే ఖతర్ లో జనాలు ప్రాణ భయంతో ఉలిక్కిపడుతున్నారు. ఇండ్ల మధ్యలోనే మిస్సైల్స్ పడుతున్నాయి. తమపై దాడికి ప్రతిగా ఇరాన్ రెచ్చిపోతుంది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికా ఆర్మీ బేస్ క్యాంపు లపై దాడులు చేస్తోంది ఇరాన్. కొన్ని మిస్సైల్స్‌ అరబ్ దేశాల్లోని పలు ప్రాంతాలలో పడ్డాయి. దీంతో అక్కడ ఉన్న జనాలు గజగజ వనికి పోతున్నారు.

ఖతర్ లో నివాస సముదాయాలు ఉన్న ఓ చోట భారీ మిస్సైల్ పడింది. దీంతో జనాలు రోడ్డుపైన పరిగెడుతూ కనిపించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. తరచూ సైరన్లు రావడం, మిసైల్స్‌ శబ్దాలతో మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు అబుదాబీలో పాకిస్తాన్ కు చెందిన యువకుడు ఇరాన్ వేసిన ఓ క్షిప‌ణి కారణంగా మరణించాడు. ఇటు భారతీయులు కూడా టెన్షన్ పడుతున్నారు.

Next Story