- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగ్గురి డీఎన్ఏతో శిశువు జననం.. బ్రిటన్ డాక్టర్ల సరికొత్త ప్రయోగం
మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్ మెంట్ పద్ధతి ద్వారా ముగ్గురి డీఎన్ఏతో బ్రిటన్ లో ఓ శిశువు జన్మించింది.

దిశ, వెబ్ డెస్క్: వైద్య రంగం రోజురోజుకు కొత్తం పుంతలు తొక్కుతోంది. కాదేది ప్రయోగానికి అనర్హమంటూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు డాక్టర్లు. తాజాగా ముగ్గురి డీఎన్ఏతో ఓ శిశువును సృష్టించారు బ్రిటన్ జన్యు శాస్త్రవేత్తలు. మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్ మెంట్ (ఎమ్డీటీ) అనే పద్ధతి ద్వారా తల్లిదండ్రులతో పాటు మరో వ్యక్తి డీఎన్ఏతో శిశువు జన్మించింది. ఇలా జన్మించిన శిశువులో 99.8 శాతం తల్లిదండ్రుల డీఎన్ఏ ఉండగా.. మిగతా డీఎన్ఏను ఓ మహిళను సేకరించారు.
అయితే తల్లిదండ్రుల నుంచి సాధారణంగా సంక్రమించే వ్యాధుల నుంచి బిడ్డను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని న్యూక్యాసిల్ క్లినిక్ కు చెందిన డాక్టర్లు చెబుతున్నారు. ఇక ఇలాంటి ప్రక్రియ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో మరింత వికాసం చెందే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాగన్ వెల్స్ తెలిపారు. కాగా మైటోకాండ్రియల్ డొనేషన్ ట్రీట్ మెంట్ (ఎమ్డీటీ) పద్ధతిని ఉపయోగించి 2016లో మొదటిసారి అమెరికాలో ఓ జోర్డానియన్ మహిళ బేబీకి జన్మనిచ్చింది.






