- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు
ఇరాన్ టాప్ లీడర్ల సమాచారం అందిస్తే, రివార్డు ఇవ్వడమే కాకుండా, సదరు వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది అమెరికా.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు దేశాల మధ్య దాదాపు 14 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో వేలాది మంది చనిపోయారు. కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వాళ్లకు 10 మిలియన్ డాలర్ల ఆఫర్ ప్రకటించింది అమెరికా.
అంటే భారత కరెన్సీలో రూ. 92.5 కోట్లు అన్నమాట. ఇరాన్ టాప్ లీడర్ల సమాచారం అందిస్తే, రివార్డు ఇవ్వడమే కాకుండా, సదరు వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని హామీ కూడా ఇచ్చింది అమెరికా. ఇక అమెరికా తాజాగా ప్రకటించిన లిస్టులో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సహా మరో తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు అమెరికా మిలిటరీకి సంబంధించిన సమాచారం ఇస్తే, కోటి రూపాయల రివార్డ్ ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ ప్రకటన చేసింది.






