వణుకు పుట్టిస్తున్న ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదాలు.. ఐదు నెలల్లోనే ఎంతమంది చనిపోయారంటే?

by Shamantha N |

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం 5 నెలల్లో 922 మంది రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు వివిధ ప్రమాదాల్లో మరణించారు.

వణుకు పుట్టిస్తున్న ముంబై లోకల్ ట్రైన్ ప్రమాదాలు.. ఐదు నెలల్లోనే ఎంతమంది చనిపోయారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేవలం 5 నెలల్లో 922 మంది రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు వివిధ ప్రమాదాల్లో మరణించారు. ఈ మరణాల్లో 210 మంది ప్రయాణికులు కదులుతున్న రైళ్ల నుంచి పడిపోవడం వల్ల సంభవించాయి. ఈ సమాచారం ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలుస్తోంది. నగర జీవనాధారంగా మారిన ముంబై సబర్బన్ రైల్వే నెట్ వర్క్ లో నిత్యం జరుగుతున్న ప్రమాదాలకు ఈ డేటాయే నిదర్శనమని చెప్పొచ్చు. ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ నుంచి సమాచార హక్కు (RTI) చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్తలు సేకరించిన సమాచారం ప్రకారం.. జనవరి 1 నుంచి మే 31, 2025 మధ్య ముంబైలో స్థానిక రైలు ప్రయాణాల్లో 922 మంది ప్యాసింజర్లు ప్రమాదవశాత్తు మరణించారని వెల్లడిస్తున్నాయి.

భద్రతా చర్యలు అంతంతమాత్రమే

ముంబైలోని లోకల్ రైల్వేలలో తగినన్నీ సదుపాయాలు లేకపోవడం, కోచ్ లు, ప్లాట్ పాంల వద్ద భద్రతా చర్యలు అంతంత మాత్రంగా ఉండటంతోనే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆయా ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి గణాంకాలు మాత్రమే కావని, ప్రజల ప్రాణాలు, భద్రతా అత్యవసర పరిస్థితిని సూచిస్తున్నాయని ఆర్టీఐ కార్యకర్త అజయ్ బోస్ అన్నారు. ముంబై సబర్బన్ రైల్వే వ్యవస్థ రోజు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 7 మిలియన్ల కు పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. కానీ ప్రయాణికుల భద్రత, భరోసా విషయంలో మాత్రం చాలా వెనకంజలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Next Story