- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత విద్యార్థికి భారీ స్కాలర్షిప్‌తో జర్నలిజం సీటు.. ఆ ఒక్క కారణంతో వీసా రిజెక్ట్
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలన్న ఆకాంక్ష చాలామందికి ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలన్న ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. మరీ ముఖ్యంగా అమెరికాలో పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో సెటిలవ్వాలని కలలు కంటుంటారు స్టూడెంట్స్. అలా అతను కన్న కలను సాకారం చేసుకునే రోజు దగ్గరికి రాగా.. అమెరికా ప్రభుత్వం ఓ విద్యార్థికి ఊహించని షాకిచ్చింది. ప్రముఖ కొలంబియా యూనివర్సిటీలో జర్నలిజం చదివేందుకు భారత్ కు చెందిన 27 ఏళ్ల కౌశిక్ రాజ్ లక్ష డాలర్ల స్కాలర్షిప్ (సుమారు రూ.88 లక్షలు) సాధించాడు. వీసా ఇంటర్వ్యూ కంప్లీట్ అయితే.. చదువుకోడానికి వెళ్లవచ్చని భావిస్తున్న క్రమంలో.. అనూహ్యంగా అమెరికా వీసా రిజెక్ట్ చేసింది.
అందుకు అమెరికా పేర్కొన్న కారణం.. చదువు తర్వాత కౌశిక్ తిరిగి స్వదేశానికి వెళ్తాడన్న నమ్మకం తమకు లేకపోవడమని చెప్పింది. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లే స్టూడెంట్స్.. స్టూడెంట్ వీసా (ఎఫ్-1)కు అప్లై చేసుకునేటపుడు తమ చదువు ఆ దేశంలో తాత్కాలికమేనని, ఆ తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్లేందుకు తమకు ఫ్యామిలీ , సన్నిహితులు ఉన్నారని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌశిక్ విషయంలో ఆ నిబంధన నెరవేరలేదని అమెరికా అధికారులు చెప్తున్నారు.
బహుశా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ కారణంగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కౌశిక్ అనుమానం వ్యక్తం చేశాడు. గతంలో తాను జర్నలిస్టుగా పనిచేసిన సమయంలో రాసిన కథనాల లింకులను సోషల్ మీడియాలో షేర్ చేశానని, వాటిని చూసిన అధికారులు అమెరికాలో స్థిరపడేందుకు వస్తున్నట్లు అపార్థం చేసుకుని ఉంటారని అభిప్రాయపడ్డాడు.






