- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-Iran : హర్మూజ్‌లో 8 గ్యాస్ ట్యాంకర్లు! ఇరాన్‌తో భారత్ కీలక చర్చలు
జలసంధి వద్ద నిలిచిపోయిన ఎనిమిది గ్యాస్ ట్యాంకర్లను సురక్షితంగా భారత్‌కు రప్పించేలా ఇరాన్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి గుండా ఇంధన రవాణాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జలసంధి వద్ద నిలిచిపోయిన ఎనిమిది గ్యాస్ ట్యాంకర్లను సురక్షితంగా భారత్‌కు రప్పించేలా ఇరాన్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జలసంధి వద్ద ఉత్కంఠ..
ప్రస్తుతం ఎనిమిది గ్యాస్ ట్యాంకర్లు హర్మూజ్ జలసంధికి సమీపంలో నిలిచిపోయి, ముందుకు వెళ్లేందుకు 'గ్రీన్ సిగ్నల్' కోసం వేచి చూస్తున్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఇప్పటికే రెండు చమురు నౌకలు జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణాన్ని ప్రారంభించాయి. మిగిలిన ఎల్‌పీజీ నౌకలను కూడా త్వరితగతిన రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మొదలైన దౌత్య చర్చలు
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీతో పలుమార్లు ఫోన్ ద్వారా చర్చలు జరిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదే సమయంలో, భారత్‌లో సుమారు 250 మంది ఇరాన్ నావికులు చిక్కుకుపోయి ఉన్నారు. వారిని స్వదేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వారికి అవసరమైన వసతి, రక్షణను కూడా కల్పిస్తోంది. తమ నావికుల విషయంలో భారత్ చూపుతున్న చొరవ పట్ల ఇరాన్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్యాస్ ట్యాంకర్ల తరలింపునకు సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం అందుతోంది.






