భారీ భూకంపంలో 622 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం సంబవించి.. 622 మంది మృతి చెందడంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

భారీ భూకంపంలో 622 మంది మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంపం (huge earthquake) సంబవించి.. 622 మంది మృతి చెందారు. అలాగే 800 మంది స్థానిక ప్రజలు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. దీంతో భూకంప తీవ్రత ఏ మేరకు ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ విజువల్స్ ప్రకారం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భూకంపం ప్రభావిత గ్రామాల్లో రెస్క్యూ ఆపరేషన్లు (Rescue operations) కొనసాగిస్తున్నారు.

ఈ విషాద సంఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) స్పందిస్తూ.. దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన తన ట్వీట్‌లో "ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాణనష్టం సంభవించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలతో మా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. బాధితులకు సాధ్యమైన అన్ని రకాల మానవతా సహాయం, సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది." అని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.

Next Story