- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ లో 585 మంది మృతి
ఇరాన్ పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 585 మంది చనిపోగా.. 1326 మందికి గాాయాలైనట్లు ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ తెలిపింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు 585 మంది చనిపోగా.. 1326 మందికి గాాయాలైనట్లు ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ తెలిపింది. ఇరాన్ లో అణు శుద్ధి కేంద్రాలు ధ్వంసంగా దాడులు కొనసాగుతున్నాయి. 585 మంది చనిపోగా.. 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రెండు వైపులా మిస్సైళ్ల దాడి కొనసాగుతూనే ఉంది. బుధవారం తెల్లవారు జామున టెహ్రాన్ లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ భీకర దాడి చేసింది. ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్‌లోనూ పేలుళ్లు సంభవించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో జెరూసలెంలోని అమెరికా ఎంబసీని తాత్కాలికంగా మూసివేశారు. యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుండటంతో వేల సంఖ్యలో టెహ్రాన్ ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
సెంట్రిఫ్యూజ్ ల తయారీ కేంద్రం ధ్వంసం
ఇరాన్ లో సెంట్రిఫ్యూజ్ ల తయారీ కేంద్రాన్ని ఇజ్రాయిల్ ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. టెహ్రాన్ అణు కార్యక్రమానికి అత్యంత కీలక సెంట్రిఫ్యూజ్‌ల తయారీ కేంద్రంపై ఐడీఎఫ్ ఫైటర్ జెట్‌లు దాడి చేసినట్లు ఆ దేశం తెలిపింది. అణు శుద్ధి కార్యక్రమంలో సెంట్రిఫ్యూజ్ ల తయారీ కీలకం. కాగా వాటిని చాలా వరకు దెబ్బతీసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. టెహ్రాన్ సమీపంలో 50 యుద్ధ విమానాలు ఏక కాలంలో విరుచుకుపడినట్లు అనేక ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. కాగా అంతర్జాతీయ అణు శక్తి సంస్థ తాజాగా చేసిన ప్రకటనలో ఇరాన్ లోని నతాంజ్ అణు కేంద్రం ధ్వంసమైనట్లు పేర్కొంది. నిన్న రాత్రి జరిపిన దాడిలో ఈ అణు కేంద్రం ధ్వంసమైందని తెలిపింది. అణుశక్తి సంస్థ అధిపతి గ్రోసి స్పందిస్తూ.. నతాంజ్ అణు కేంద్రం అండర్ గ్రౌండ్ లో ఉందని దానికి ఏమీ కాలేదని నిన్న తెలపగా.. ఈ రోజు నతాంజ్ అణు కేంద్రం ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు.






