- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా భారీ ప్రయోగం.. ఒకేసారి నింగిలోకి 52 ఉపగ్రహాలు
రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి నింగిలోకి 52 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది.

దిశ, వెబ్ డెస్క్: రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకేసారి నింగిలోకి 52 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది.వోస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుండి సోయుజ్ 2.1బీ వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోసం రూపొందించిన ఓ విద్యా ఉపగ్రహం కూడా ఉంది. రష్యా, యూఏఈ మరియు కువైట్ మధ్య సహకారం పెంచడంతో పాటు అరబ్ దేశాల్లో అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తి పెంపొందించడం, రేడియో బ్రాడ్ కాస్టింగ్ సేవలు అందించడం ఈ ఉపగ్రహం ముఖ్య ఉద్దేశం అని స్పుత్నిక్స్ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు.
దీంతో పాటు సముద్రంలో నౌకల కదలికలను గుర్తించేందుకు రష్యా పదుల సంఖ్యలో క్యూబ్ శాట్ 3యూ ఉపగ్రహాలను రష్యా కక్ష్యలోకి పంపింది. అంతే కాకుండా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని పరీక్షించేందుకు సిట్రో టీడీ ఉపగ్రహాలను సైతం ప్రయోగించినట్టు కంపెనీ వెల్లడించింది. రష్యా పంపిన 52 ఉపగ్రహాల్లో రెండు ఉపగ్రహాలు అతిముఖ్యమైనవి. ఇవి భూ ఉపరితలాన్ని ఫోటోలు తీసి డిజిటల్ మ్యాపులను రూపొందించడంతో సహాయపడతాయి. ప్రకృతి విపత్తులను పర్యవేక్షించడానికి సైతం ఇవి ఉపయోగపడతాయి.






