లోయలో పడిన బస్సు.. 40 మంది మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-07-03 10:13:57  IST  )

శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. క్వెట్టా నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు.. వాయువ్య పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతంలో నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది.

లోయలో పడిన బస్సు.. 40 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం తెల్లవారుజామున పాకిస్తాన్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. క్వెట్టా నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ప్రయాణికుల బస్సు.. వాయువ్య పాకిస్తాన్ లోని పర్వత ప్రాంతంలో నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మహిళలు, పిల్లలతో సహా 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్రంగా గాయాలవ్వగా.. స్థానికులు, పోలీసులు వారిని అక్కడి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్సులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లా పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదకరమైన మలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, అందుకే డ్రైవర్ తన వెహికల్ ను నియంత్రించలేకపోయాడని తెలుస్తోంది. రోడ్డుపై వెళ్తున్న బస్సు జారి.. లోయలోకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరణించినవారిని, గాయపడినవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని షేరానీ డిప్యూటీ కమిషనర్ వాలి ఖాన్ కాకర్ తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు.

Next Story