అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 3,375 మంది ఇరాన్ పౌరుల మృతి!

by Ramesh Naini |

గత 40 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 3,375 మంది పౌరులు మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 3,375 మంది ఇరాన్ పౌరుల మృతి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత 40 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన దాడుల్లో 3,375 మంది పౌరులు మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. పాకిస్తాన్ వేదికగా అమెరికాతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసిన్ (లీగల్ మెడిసిన్) ఆర్గనైజేషన్ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు గుర్తించిన 3,375 మంది మృతుల్లో 2,875 మంది పురుషులు, 496 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య కేవలం ‘గుర్తించిన’ మృతదేహాలకు సంబంధించినది మాత్రమేనని, తుది మృతుల సంఖ్యను ఇంకా నిర్ధారించాల్సి ఉందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.

మానవ హక్కుల సంస్థల అంచనా..

స్వతంత్ర మానవ హక్కుల సంస్థ ‘హెచ్చార్‌ఏఎన్‌ఏ’ (HRANA) నివేదిక ప్రకారం మొత్తం మృతుల సంఖ్య 3,636గా ఉంది. వీరిలో 254 మంది చిన్నారులతో సహా 1,701 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు సుమారు 2,000 మంది మరణించగా, ఇటీవల ఒక్కరోజే 300 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో లెబనాన్‌పై దాడుల అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.

Next Story