- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్!
ఇరాన్‌లో ముగ్గురు భారతీయుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. తమ వాళ్లు మిస్ అయ్యారు అంటూ కుటుంబ సభ్యులు ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇవ్వడంతో అధికారులు ఇరాన్ ఎంబసీని సంప్రదించారు.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లో ముగ్గురు భారతీయుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. తమ వాళ్లు మిస్ అయ్యారు అంటూ కుటుంబ సభ్యులు ఇండియన్ ఎంబసీకి సమాచారం ఇవ్వడంతో అధికారులు ఇరాన్ ఎంబసీని సంప్రదించారు. దీంతో మిస్ అయిన వారి అడ్రస్ వెంటనే ట్రేస్ చేయాలని ఇరాన్ ఎంబసీ అక్కడి అధికారులను ఆదేశించింది. మిస్ అయినవారు పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువకులుగా తెలుస్తోంది. యువకులు పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన హుషన్‌ప్రీత్ సింగ్, ఎస్‌బీఎస్ నగర్‌కు చెందిన జస్పాల్ సింగ్ మరియు హోషియార్‌పూర్‌కు చెందిన అమృత్ పాల్ అని సమాచారం.
వీరు మే 1న టెహ్రాన్‌కు చేరుకున్న కొద్దిసేపటికే అదృశ్యమయ్యారు. కాగా హుషన్ ప్రీత్ తల్లి మీడియాతో మాట్లాడుతూ యువకులు కిడ్నాప్ అయ్యారని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని, తాత్కాలిక బస కోసం ఇరాన్ రావాలని ఓ ట్రావెల్ ఏజెంట్ వారివద్ద నుండి డబ్బులు తీసుకున్నట్టు తెలిపారు. మే 1న వారు ఇరాన్ చేరుకున్న వెంటనే ఏజెంట్ వారిని కిడ్నాప్ చేయించి ఉంటాడని చెప్పారు. కిడ్నాపర్లు యువకులను విడిచిపెట్టాలి అంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాని అన్నారు. యువకులను తాళ్లతో కట్టేసి, వారి చేతులపై రక్తం కనిపించేలా వీడియో తీసి తమకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు చెల్లించకపోతే ముగ్గురినీ చంపేస్తామని హెచ్చరించారని అన్నారు.






