భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 23 మంది మృతి

by Naga Rani Yarlagadda |

భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 23 మంది మరణించిన విషాద ఘటన ఆఫ్రికన్ కంట్రీ అయిన కెన్యా దేశంలో చోటుచేసుకుంది.

భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 23 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 23 మంది మరణించిన విషాద ఘటన ఆఫ్రికన్ కంట్రీ అయిన కెన్యా దేశంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 30 మందికి పైగా గల్లంతయ్యారు. సౌత్ కెన్యా ప్రాంతంలోని మారాక్ వెట్ ప్రాంతంలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కిప్చుంబా ముర్కోమెన్ తెలిపారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్షతగాత్రులను విమానంలో ఎల్డోరెట్ లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో రోడ్డుపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ మౌలిక సదుపాయాలకు సైతం ఆటంకం వాటిల్లింది. రోడ్డు నెట్ వర్క్ ను పునరుద్ధరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. నదీపరివాహక ప్రాంతాలు, కొండచరియలకు సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

Next Story