- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
19 వేల మంది చిన్నారులను చంపేశారు.. పార్లమెంటులో ఎంపీ షాకింగ్ కామెంట్లు
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలు (Israel-Hamas Conflict) కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలు (Israel-Hamas Conflict) కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులలో ఎంతో మంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బతికున్నవారు ఆకలితో అలమటిస్తున్నారు. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ఎంపీ ఐమన్ ఒడె (Ayman Odeh) అక్కడి పార్లమెంటులో గళమెత్తారు. గాజాపై టెల్‌అవీవ్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు గాజాలో 19 వేల మంది చిన్నారులను చంపేశారని ఆరోపించారు. 53 వేల మంది నివాసితులను చంపేశారని అన్నారు. యూనివర్సిటీలు, ఆస్పత్రులు అన్నీ నాశనం చేసినప్పటికీ.. రాజకీయంగా గెలిచామనే భావనకు రాలేకపోతున్న పిచ్చివాళ్లు అంటూ విమర్శించారు. ఒడె మాటలతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఐమన్ వ్యాఖ్యలను పార్లమెంటులోని కొందరు సభ్యులు వ్యతిరేకించారు. ఈక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడి అధికారులు పోడియం నుంచి పక్కకు లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక, ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ (Israel) దాడులు తీవ్రతరం చేసింది. దీంతో టెల్‌అవీవ్ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే ఐడీఎఫ్ విశ్రాంత చీఫ్ యాయిర్ గొలాన్ కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇటీవల మండిపడ్డారు. చిన్నారులను చంపడం హాబీగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాగా, 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేశారు. 1200 మందిని చంపేశారు. 251 మందిని బందీలుగా మార్చారు. దీంతో రెండు దేశాల మధ్య యుద్దం మొదలైంది. 59 మంది బంధీలు ఇంకా గాజాలోనే ఉన్నారు. హమాస్ చేసిన పనికి ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. బాంబు దాడులకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 53 వేలకు పైగా పాలస్తీనియన్లను చంపేసింది.






