మెక్సికోలో దారుణం.. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. మరణం!

by Sujitha Rachapalli |

14ఏళ్ల మైనర్ బాలిక పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడో మరణం మెక్సికోను షేక్ చేస్తుంది. కారణం బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ తర్వాత వారానికే చనిపోవడం. కాగా అంత్యక్రియల్లో ఈ సర్జరీ గాయాలను గుర్తించిన తండ్రి కార్లోస్ అరెల్లానో.. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో

మెక్సికోలో దారుణం.. 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. మరణం!
X

దిశ, వెబ్ డెస్క్ : 14ఏళ్ల మైనర్ బాలిక పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడో మరణం మెక్సికోను షేక్ చేస్తుంది. కారణం బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ తర్వాత వారానికే చనిపోవడం. కాగా అంత్యక్రియల్లో ఈ సర్జరీ గాయాలను గుర్తించిన తండ్రి కార్లోస్ అరెల్లానో.. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయిపోయింది. పాలోమా తల్లి నిర్లక్ష్యం, ఆమె ప్రజెంట్ భర్త కారణంగానే ఇదంతా జరిగిందని.. ఈ ఆపరేషన్‌లో ఇంప్లాంట్స్ ఉపయోగించబడ్డాయని ఆరోపించాడు.

సోషల్ మీడియా యుగం మైనర్లు అందం ప్రమాణాలను అనుసరించేలా చేస్తుంది. పర్ఫెక్ట్ ఫిజిక్ ఉండాలనే ఆలోచనతో పిల్లలు తప్పుడు దారులను ఎంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ పాలోమా ఘటనే. ఇన్‌స్టా, టిక్ టాక్‌లో యాక్టివ్‌గా ఉండే పాలోమా ఓ ప్రైవేట్ క్లినిక్‌లో బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. తండ్రికి తెలియకుండానే ఇదంతా జరిగినట్లు సమాచారం. కాగా ముందుగా ఆమె మరణ ధృవీకకణ పత్రంలో వ్యాధితో చనిపోయిందని పేర్కొన్నారని.. మెదడు వాపు, మెదడుకు ఆక్సిజన్ సప్లయ్ తగ్గిపోవడం వల్ల చనిపోయిందని తేల్చారని చెప్పాడు ఆమె తండ్రి. కానీ ఈ సర్జరీ కారణంగా ఏర్పడ్డ శ్వాసకోశ సమస్యలు తన బిడ్డ మరణానికి కారణమని.. ఈ విషయాన్ని దాచి కవర్ చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఆయన.. క్లినిక్, వైద్యుడు, తల్లి, ఆమె రెండో భర్త కవర్ అప్‌కు బాధ్యులని.. దీనిపై పూర్తిగా సమాధానం కావాలని కోరాడు. ప్రస్తుతం అధికారికంగా విచారణ కొనసాగుతున్నట్లు మెక్సికన్ అథారిటీస్ ప్రకటించాయి.

Next Story