- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచు తుఫాన్ ఎఫెక్ట్.. న్యూయార్క్‌లో 1300 విమానాలు రద్దు
నార్త్ ఈస్ట్ అమెరికాకు మంచు తుఫాన్ చుక్కలు చూపిస్తోంది. న్యూయార్క్‌లో నేడు 1300 విమానాలు రద్దయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: నార్త్ ఈస్ట్ అమెరికాకు మంచు తుఫాన్ చుక్కలు చూపిస్తోంది. మంచు కారణంగా ఈశాన్య రాష్ట్రమంతా అంతలాకుతలం అవుతోంది. మెట్రోపాలిటన్ నగరంలో దాదాపు 60 సెం.మీ వరకు మంచు కురవడంతో న్యూయార్క్ నుండి వెళ్లాల్సిన, న్యూయార్క్‌కు రావాల్సిన విమానాలు భారీ సంఖ్యలో రద్దయ్యాయి. న్యూయార్క్ లోని మూడు విమానాశ్రయాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం, లాగ్వార్డియా విమానాశ్రయం మరియు న్యూయార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటి వరకు మొత్తం 1300 విమానాలు రద్దు చేయబడినట్టు అధికారులు చెబుతున్నారు. మంచుతో పాటు తీవ్రమైన గాలులు, తీరప్రాంతాల్లో వరదల కారణంగా విమానాలు నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు సోమ, మంగళవారాల్లోనూ న్యూయార్క్ లో ఇదే పరిస్థితి కనిపించింది. సోమవారం అమెరికాలో 5,706 కంటే ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి. మంగళవారం 2వేల కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి. ఇదిలా ఉంటే ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ తుఫాన్‌ను క్లాసిక్ బాంబ్ సైక్లోన్, నార్ ఈస్టర్‌గా వాతావరణ నిపుణులు అభివర్ణిస్తున్నారు.






