- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran-Israel war: ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం.. 10 ఇంట్రస్టింగ్ విషయాలు
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం మరింత ముదురుతోంది. రెండు దేశాల మధ్య దాడులు ప్రారంభమై ఇప్పటికీ ఐదు రోజులు గడిచిపోయాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం మరింత ముదురుతోంది. రెండు దేశాల మధ్య దాడులు ప్రారంభమై ఇప్పటికీ ఐదు రోజులు గడిచిపోయాయి. ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాగా మిడిల్ ఈస్ట్ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
1. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య భీకర పోరు కొనసాగుతుండగా ఇజ్రాయిల్ ఇంటిలిజెన్స్ విభాగం మొస్సాద్ కు చెందిన ఎజెంట్ ను ఇరాన్ శనివారం ఉరి తీసింది. ఇజ్రాయిల్ కు ఇరాన్ కు సంబంధించిన రహస్య సమాచారాన్ని చేరవేరుస్తున్నాడనే నెపంతో ఇరాన్ అతడిని ఉరి వేసి చంపింది.
2. టెహ్రాన్ లో ఇజ్రాయిల్ గూడచార సంస్థ మొస్సాద్ కు చెందిన ఓ భవనాన్ని ఇరాన్ పేల్చేసింది. అందులోంచి దాదాపు 200 కిలోల పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాంచర్లు తదితర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
3. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పై ఇజ్రాయిల్ మిస్సైళ్లతో చేసిన దాడుల్లో ముగ్గురు మరణించారు. దీనిపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ఇజ్రాయిల్ వివరణ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్న ఎవరైనా సరే ఇలాంటి శిక్షే ఎదుర్కొంటారని తెలిపింది.
4. ఇరాన్ ఇజ్రాయిల్ లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఈ దాడుల్లో అమెరికా ఎంబసీ దెబ్బతినగా అందులో ఎవరికీ గాయాలు కాలేవని తెలుస్తోంది. దీనిపై అమెరికా ఇరాన్ పై గుర్రుగా ఉంది. అంతకుముందే అమెరికా జోలికి వస్తే ఇరాన్ కు చావు దెబ్బతప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
5. టెహ్రాన్ లోని విమానాశ్రయంలో ఇజ్రాయిల్ పై దాడికి సిద్ధంగా ఉంచిన రెండు ఎఫ్ 14 యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఏకంగా విమానాశ్రయంపై దాడి చేయడంతో ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఇజ్రాయిల్ విడుదల చేసింది.
6. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో ఎయిర్ పోర్టులు మూసివేస్తున్నారు. వేలాది మంది ఎయిర్ పోర్టుల్లో చిక్కుపోయారు. ఇరాక్, ఇరాన్, జోర్డాన్, లెబనాన్ ఎయిర్ పోర్టులను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
7. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సు నుంచి మధ్యలోనే అమెరికా తిరిగొచ్చారు. ఇరాన్ పై దాడి ముమ్మరం కానుందని అందుకే అమెరికా అధ్యక్షుడు తిరిగొచ్చారని ప్రచారం జరుగుతోంది.
8. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేస్తూ శాంతి చర్చలు అంటే కుదరదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహు అన్నారు. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేస్తే అది ప్రపంచానికే ప్రమాదమని అన్నారు. అందుకే ముందుగానే ఇరాన్ పై దాడులు చేస్తున్నామని అణు ప్రోగ్రాంలను కానిచ్చేది లేదని ప్రకటించారు.
9. భారతీయులు ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత తొందరగా టెహ్రాన్ ను వీడాలని సూచనలు చేసింది. దీని కోసం భారత రాయబార కార్యాలయం కొన్ని హెల్ఫ్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించింది.
10. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కు చేరుకున్నారు. ఇది అత్యంత కీలకమైన పరిణామం. చాలా కీలక సమయాల్లోనే అమెరికా అధ్యక్షులు సిచ్యువేషన్ రూమ్ కు వెళుతుంటారు. దీంతో ఇరాన్ పై అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ పై ఏకకాలంలో దాడులకు దిగి అణు ప్లాంట్ లను ధ్వంసం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
Also Read..
ఇరాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఇజ్రాయెల్.. టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి






