- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవ్వు గురించి నలుగురు ఏమన్నారంటే…
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా రూపంలో బయట ఒక మహమ్మారి ఎదురుచూస్తున్నా… ఇంట్లోనే సురక్షితంగా ఉన్న మిమ్మల్ని నవ్వకుండా ఎవరూ ఆపలేరు. కాబట్టి ఈ నవ్వుల దినోత్సవాన్ని నవ్వుతూ గడపండి. ప్రతి ఏడాది మే నెలలో మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొదటిసారిగా 1998, జనవరి 10న ముంబైలో లాఫ్టర్ యోగా ఉద్యమ స్థాపకుడు డాక్టర్ మదన్ కటారియా నవ్వుల రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్వు విలువను తెలియజేస్తూ, కష్టసమయాల్లో మనకు ఆదర్శాన్ని కలిగించే […]</p>

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా రూపంలో బయట ఒక మహమ్మారి ఎదురుచూస్తున్నా… ఇంట్లోనే సురక్షితంగా ఉన్న మిమ్మల్ని నవ్వకుండా ఎవరూ ఆపలేరు. కాబట్టి ఈ నవ్వుల దినోత్సవాన్ని నవ్వుతూ గడపండి. ప్రతి ఏడాది మే నెలలో మొదటి ఆదివారాన్ని ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మొదటిసారిగా 1998, జనవరి 10న ముంబైలో లాఫ్టర్ యోగా ఉద్యమ స్థాపకుడు డాక్టర్ మదన్ కటారియా నవ్వుల రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్వు విలువను తెలియజేస్తూ, కష్టసమయాల్లో మనకు ఆదర్శాన్ని కలిగించే ఓ నలుగురు గొప్పవాళ్లు చెప్పిన సూక్తులు మీకోసం…
1. ప్రపంచంలో అత్యంత వేగంగా అంటుకోగలిగిన వాటిలో నవ్వుని మించినది లేదు – చార్లెస్ డికెన్స్
2. నవ్వకుండా ఒకరోజు ఉన్నావంటే, ఆరోజు వృథా అయినట్లే – చార్లీ చాప్లిన్
3. మనం నవ్వలేకపోయి ఉంటే, ప్రపంచమంతా పిచ్చిదై ఉండేది – రాబర్ట్ ఫ్రోస్ట్
4. వీలైనప్పుడల్లా నవ్వండి. అంతకంటే చౌకగా దొరికే మందు ఇంకొకటి లేదు – లార్డ్ బైరాన్
5. నవ్వడం ఒక వ్యాయామం లాంటిది, ఆరోగ్యానికి చాలా మంచిది – అరిస్టాటిల్
6. సమస్య నీ తలుపు కొట్టింది, కానీ లోపల ఉన్న నీ నవ్వు చూసి పారిపోయింది – బెంజమిన్ ఫ్రాంక్లిన్
7. నవ్వు కాలం లేదు, ఊహకు వయసులేదు, కలలు శాశ్వతం – వాల్ట్ డిస్నీ
8. కన్నీటిలో దాగి ఉన్న నవ్వు, నాశనంలో ఉన్న నిధి లాంటిది – రూమీ
Tags: corona, covid, world laughter day, laugh, rumi, charles dickens, charlie chaplin, madam kataria






