- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి ఓసీపీ-1లో ఘోర ప్రమాదం.. కార్మికుడు మృతి
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాజమాన్యం ఇప్పటికే కార్మికుల కోసం పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నది. ఈ సందర్భంగా ఓసీపీ-1లో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-1 లో జరిగిన ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. గోదావరిఖని గంగానగర్‌లోని మిలీనియం క్వాటర్‌లో నివాసముండే శ్రీనివాసరావు రోజులాగే విధుల్లోకి వెళ్ళాడు. రాత్రి షిఫ్టుల్లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా, క్వారీ ఏరియాలో డంపర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుక […]</p>

X
దిశ, గోదావరిఖని : సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యాజమాన్యం ఇప్పటికే కార్మికుల కోసం పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నది. ఈ సందర్భంగా ఓసీపీ-1లో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆర్జీ-3 ఏరియా ఓసీపీ-1 లో జరిగిన ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి.
గోదావరిఖని గంగానగర్‌లోని మిలీనియం క్వాటర్‌లో నివాసముండే శ్రీనివాసరావు రోజులాగే విధుల్లోకి వెళ్ళాడు. రాత్రి షిఫ్టుల్లో కార్మికులు విధులు నిర్వహిస్తుండగా, క్వారీ ఏరియాలో డంపర్ రివర్స్ తీస్తున్న క్రమంలో వెనుక ఉన్న మరో డంపర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఆపరేటర్ శ్రీనివాస్‌రావు మృతి చెందాడు. మృతునికి భార్య, కూతురు ఉన్నారు.
Next Story






