- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిల్లలు చూస్తుండగా తల్లి ఆత్మహత్య..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం పరిధిలోని లాలాగూడలో తీవ్ర విషాదం నెలకొంది. మంజుల అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లెదుటే తల్లి చనిపోతున్నా పిల్లలు కాపాడలేని పరిస్థితిలో ఉండిపోయారు. వెంటనే ఇంటి దగ్గరే బేకరి నడుపుతున్న తండ్రికి కాల్ చేయడంతో అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. వచ్చి చూసే సరికి డోర్ గడియ ఉంది. గట్టిగా తోసుకుని వెళ్లి చూసే సరికి ఆ వివాహిత […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం పరిధిలోని లాలాగూడలో తీవ్ర విషాదం నెలకొంది. మంజుల అనే వివాహిత తన ఇద్దరు పిల్లలు చూస్తుండగానే సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కళ్లెదుటే తల్లి చనిపోతున్నా పిల్లలు కాపాడలేని పరిస్థితిలో ఉండిపోయారు. వెంటనే ఇంటి దగ్గరే బేకరి నడుపుతున్న తండ్రికి కాల్ చేయడంతో అతను హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు.
వచ్చి చూసే సరికి డోర్ గడియ ఉంది. గట్టిగా తోసుకుని వెళ్లి చూసే సరికి ఆ వివాహిత అప్పటికే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంజుల మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






