- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకును ఢీకొన్న లారీ.. మహిళ మృతి
<p>దిశ, మహేశ్వరం : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న ఓ మహిళను వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన గురువారం జిల్లాలోని మహేశ్వరం పీఎస్ పరిధిలోని సిరిగిరిపురం గేట్ సమీపంలో జరిగింది. వివరాల్లోకివెళితే.. ద్విచక్రవాహనం (టీఎస్ 07 జీవై 4237)పై కురుమాల గూడకు చెందిన బాబు, అతని భార్య మహేశ్వరం వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ(ఏపీ24టీబీ1493) వేగంగా ఢీకొనడంతో […]</p>

దిశ, మహేశ్వరం :
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న ఓ మహిళను వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన గురువారం జిల్లాలోని మహేశ్వరం పీఎస్ పరిధిలోని సిరిగిరిపురం గేట్ సమీపంలో జరిగింది. వివరాల్లోకివెళితే.. ద్విచక్రవాహనం (టీఎస్ 07 జీవై 4237)పై కురుమాల గూడకు చెందిన బాబు, అతని భార్య మహేశ్వరం వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ(ఏపీ24టీబీ1493) వేగంగా ఢీకొనడంతో దంపతులిద్దరూ బైకు మీద నుంచి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో బాబు భార్యకు తీవ్రగాయాలవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






