- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం తాగి వెళ్లింది.. డ్యాంలో శవమైంది
<p>దిశ, మహబూబ్ నగర్: మద్యం సేవించి బయటకు వెళ్లిన ఓ మహిళ మరుసటి రోజు డ్యాంలో శవమై తేలింది.ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ వద్ద మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం..మృతురాలు మాగనూర్ మండలం నెరడగం గ్రామానికి చెందిన పద్మ(38)గా గుర్తించారు. ఈమె సోమవారం సాయంత్రం మద్యం సేవించి ఇంట్లో నుంచి వెళ్లినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.తిరిగి ఆమెనే ఇంటికి వస్తుందని ఎదురు చూడగా, మంగళవారం డ్యాంలో పద్మ మృతదేహం కనిపించినట్టు సమాచారం […]</p>
దిశ, మహబూబ్ నగర్: మద్యం సేవించి బయటకు వెళ్లిన ఓ మహిళ మరుసటి రోజు డ్యాంలో శవమై తేలింది.ఈ ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని సంగంబండ వద్ద మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు కథనం ప్రకారం..మృతురాలు మాగనూర్ మండలం నెరడగం గ్రామానికి చెందిన పద్మ(38)గా గుర్తించారు. ఈమె సోమవారం సాయంత్రం మద్యం సేవించి ఇంట్లో నుంచి వెళ్లినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు.తిరిగి ఆమెనే ఇంటికి వస్తుందని ఎదురు చూడగా, మంగళవారం డ్యాంలో పద్మ మృతదేహం కనిపించినట్టు సమాచారం అందిందన్నారు. అయితే మృతురాలు గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోందని కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తలరించామన్నారు.
Next Story






