ఇదెక్కడి ఘోరం.. మహిళ మృతికి కారణమని రైతును కొట్టి చంపుతారా..?

by  |

దిశ , గూడూరు : ఉమ్మడి వరంగల్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారు చిల్లగండి తండాకు చెందిన గుగులోత్ ఈర్య (50) జంతువుల బారి నుండి తన పంటను కాపాడుకోవడానికి విద్యుత్ వైర్లను అమర్చాడు.అయితే, ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి గుగులోత్ బుల్లి (35) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గుగులోత్ బుల్లి అనే మహిళ చేను దగ్గరికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుల్లి మృతి చెందడానికి గుగులోత్ ఈర్య అనే వ్యక్తి కారణం అని భావించిన బంధువులు కోపోద్రిక్తులై అతన్ని తీవ్రంగా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్ర గాయాలపాలైన ఈర్యను గూడూరు ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ గుగులోత్ ఈర్య కూడా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్ గూడూరు ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీతో పాటు గూడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజిరెడ్డి, గూడూరు, కొత్తగూడ ఎస్‌ఐలు సతీశ్, సురేష్ ఉన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story