తిరుపతిలో అర్ధరాత్రి దారుణం.. మహిళ మృతి, బాలిక పరిస్థితి విషమం

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-10-22 23:30:43  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని వెస్ట్ చర్చ్ బ్రిడ్జ్ నీట మునిగింది. ఈ క్రమంలో కర్నాటకకు చెందిన ఏడుగురు భక్తులతో వెళ్తున్న తుఫాన్ వాహనం.. ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ నీటిలో మునిపోయింది. వరద నీటిలో నుంచి అతి కష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సంధ్య అనే మహిళ ఊపిరాడక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. [&hellip;]</p>

తిరుపతిలో అర్ధరాత్రి దారుణం.. మహిళ మృతి, బాలిక పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని వెస్ట్ చర్చ్ బ్రిడ్జ్ నీట మునిగింది. ఈ క్రమంలో కర్నాటకకు చెందిన ఏడుగురు భక్తులతో వెళ్తున్న తుఫాన్ వాహనం.. ప్రమాదవశాత్తు బ్రిడ్జ్ నీటిలో మునిపోయింది. వరద నీటిలో నుంచి అతి కష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు.

వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో సంధ్య అనే మహిళ ఊపిరాడక చనిపోయింది. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. తుఫాన్ వాహనం నీటిలో మునిగిపోవడంతో డ్రైవర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోవడం గమనార్హం.

Next Story