బ్రేకింగ్ : చిక్లి వాగులో కుళ్లిపోయిన మహిళా డెడ్ బాడీ కలకలం

by  |
బ్రేకింగ్ : చిక్లి వాగులో కుళ్లిపోయిన మహిళా డెడ్ బాడీ కలకలం
X

దిశ, మాక్లూర్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం చిక్లి గ్రామ శివారులోని వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. 45 నుంచి 50 ఏళ్ల వయసు గల మహిళ మృతదేహం కొద్దిసేపటి కిందట జాలర్ల వలకు చిక్కడంతో వారు హతాశులయ్యారు. మృతురాలి ఒంటిపై ఎరుపు రంగు జాకెట్, ఆకుపచ్చ చీర, చేతులకు పచ్చ గాజులు, మెడలో నల్ల పూసల దండ ఉన్నట్టు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని జాలర్లు తెలిపారు.

రెండు లేదా మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఉదయం వాగులో చేపల వేటకు వెళ్లిన జాలర్లు చేపల కోసం వేసిన వలకు మృతదేహం చిక్కి పైకి తేలడంతో ఒక్కసారిగా వారు భయభ్రాంతులకు గురయ్యారు. వలకు చిక్కిన మృతదేహాన్ని అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి మాక్లూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతదేహం లభించిన ప్రాంతం నిర్మానుష్య ప్రదేశం కావడంతో పలు అనుమానాలకు తావిస్తున్నది. సదరు మహిళ ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయిందా? లేకపోతే హత్యా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed