ఈటల నుంచి రక్షించండి.. ఏసీపీకి మహిళలు ఫిర్యాదు

112

దిశ, హుజూరాబాద్: అవినీతి అక్రమాలను బయటపెట్టినందుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమునా రెడ్డిలు కొంతమంది వ్యక్తులచే ఈటల దళిత బాధితుల సంఘం సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి నుండి తమకు రక్షణ కావాలని కోరుతూ ఆదివారం హుజురాబాద్ ఏసీపి వెంకట్ రెడ్డికి మహిళలు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అక్రమాస్తులపై తిప్పారపు సంపత్ బయటకు తీసి నందుకు గాను ఆయనపై, మరి కొందరిపై కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు.

ఇంతేకాక రెండు సంఘాలతో భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో తిప్పారపు చంద్రావతి, సునీత, భారతి మేకల రాధా సౌందర్య కవిత దాట్ల స్రవంతులు ఉన్నారు

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..